ప్రపంచ వ్యాప్తంగా కారోనా భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఏ దేశాన్ని చూసుకున్నా వందల్లో, వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో వున్నాయి. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఈ ఇరు దేశాల్లో కరోనా మరణాల సంఖ్య ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ దేశాల్లో మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి.
అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా కేసులు పదివేలు దాటడం ఇగతా దేశాల్ని భయాందోళనకు గురిచేస్తోంది. జీడీపీలోనూ, ఎకానమీ లోనూ ప్రపంచదేశాలకు ముందుండే అమెరికాలోనే ఇలా వుంటే మిగతా దేశాల పరిస్థితి ఏంటని అంతా భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితిని అదుపులోక తీసుకురావాలంటు లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని ఇండియా అంతటా లాక్ డౌన్‌ని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా వుండాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సినీ స్టార్స్ కూడా మేమున్నామంటూ ముందుకొచ్చి ఆర్థక సహాయాన్ని ప్రకటిస్తున్నారు. జనసేనాని, హీరో పవన్‌కల్యాణ్ రెండు కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు 50, 50, పీఎం సహాయ నిధికి కోటి ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు.