కరోనా దెబ్బ ఇండస్ట్రీకి మామూలుగా తగల్లేదు. ఒక్కసారిగా కరోనా విజృంభించడంతో దేశ వ్యాప్తంగా అన్నీ రంగాలు బంద్ పాటించడం మొదలుపెట్టాయి. థియేటర్లు. షాపింగ్ మాల్స్, సినిమా షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోయాయి. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్‌ని కంటిన్యూ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి రావడంతో సినీ పెద్దల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే రిలీజ్‌కు సిద్ధమైన చిత్రాలు రిలీజ్ డేట్‌లు మార్చుకున్నాయి.
అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత సగటు ప్రేక్షకుడు థియేటర్ రావడం కష్టంగా కనిపిస్తోంది. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ఎత్తేసినా జనాల్లో కరోనా భయం పోదు కాబట్టి సామాన్య జనం థియేటర్‌కు రవడం కష్టంగానే కనిపిస్తోంది. ఒక వేళ వచ్చినా ఇంతకు ముందులా థియేటర్ మొత్తం నిండని పరిస్థితి. ఈ సమయంలో జనాన్ని ఆకట్టుకోవాలంటే ఓకటే మార్గం టిక్కెట్ రేట్లు సాధ్యమైనంత వరకు తగ్గించడమే అని, అలా చేస్తేనే ఎంతో కొంత జనం థియేటర్లకు వస్తారని నిర్మాతలు భావిస్తున్నారట.
ప్రస్తు వసూలు చేస్తున్న టిక్కెట్ రేట్‌లో అత్యధిక శాతం తగ్గించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. మల్టీ ప్లెక్స్ థియేటర్లతో పాటు సింగిల్ స్క్రిన్‌దీ ఇదే పరిస్థితని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై సంచలన నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకోబోతున్నట్టు తెలిసింది. అలా చేసినా జూన్ వరకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కష్టమే.