సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి` చిత్రంతో హీరోయిన్ కీర్తి సురేష్ స్థాయే మారిపోయింది. ఈ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న కీర్తి ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా మారిపోయింది. ఇటీవల తనకు ప్రాధాన్యం వున్న పాత్ర ఇవ్వలేదని `మైదాన్` చిత్రం నుంచి కీర్తిసురేష్ తప్పుకుని షాకిచ్చింది.
ఇదిలా వుంటే కీర్తిసురేష్ తమిళనాడుకు చెందిన ఓ బీజేపీ లీడర్ తనయుడిని వివాహం చేసుకోబోతోందని, తండ్రి సురేష్‌కుమార్ ఈ సంబంధాన్ని కుదర్చారని, ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని కీర్తి సురేష్ కండించినట్టు వార్తలు వినిపించాయి. అయితే కీర్తి సురేష్ పెళ్లి వార్తల్ని వైరల్ చేసింది ఎవరు? ఎవరి ద్వారా కీర్తి పెళ్లి న్యూస్ బయటికి వచ్చింది? అని ఆరా తీస్తే కామెడియన్ సతీష్ కారణంగా అని తెలిసింది.
పలు తమిళ చిత్రాల్లో కమెడియన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నసతీష్ ఈ వార్తల్ని పుట్టించాడట. తనకు త్వరలో ఓ బిజినెస్ మేన్‌తో వివాహం జరగబోతోందని కీర్తి సురేష్ తనతో చెప్పిందని కమెడియన్ సతీష్ చెన్నైలోని ఓ మీడియా వర్గానికి ఉప్పందించాడని, దాంతో కీర్తి పెళ్లి వార్తలు జోరుగా వినిపించాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తన పెళ్లి వార్తలు వైరల్ కావడంతో తను అంగీకరించిన భారీ చిత్రాల నుంచి తనని తప్పిస్తారేమోనని కీర్తి భయపడుతోందట.