లాక్ డౌన్ వేళ భామలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఏదో ఒక పని పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఇక అందమైన భామలంతా తమ అందాలకు మెరుగులు దిద్దే పనిలో పడిపోయారు. జిమ్ చేస్తూ.. యోగసనాలు వేస్తూ.. ధ్యానంతో రూప లావణ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. డే అంతా ఇంట్లోనే ఉండటంతో మెజారిటీ భామలంతా యోగాపైనే పడుతున్నారు. రకరకాల భంగిమల్లో యోగాసనాలు వేస్తూ ఆరోగ్యంతో పాటు.. మంచి ప్రచారం కొట్టేస్తున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ వైవిధ్యమైన యోగా వీడియోలతో కుర్ర కారులో హీట్ పెంచేస్తున్నారు. యోగాసనాల విషయంలోఇంత వరకూ ఏ భామ చూపించనన్ని భంగిమల్ని ఈ భామలిద్దరూ చూపించారు.
యోగా గురు బాబా రాందేవ్ నే మించిపోతున్నారంటూ ఆ భామల వీడియోల్ని యూత్ ఓ రేంజ్ లో వైరల్ చేశారు. అసలు యోగా అంటే వేరే గాడెస్ ని తలచుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ నటి మిసెస్ శిల్పాశెట్టి కుంద్రా యోగాసనాల్లో స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. శిల్ప వయసు 45 కు రీచ్ అయినా ఇంకా…అదే యవ్వనాన్ని మెయింటెయిన్ చేయగలుగుతోందంటే యోగా వల్లనే. నిత్యం జిమ్ము..యోగాసనాల తో ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ నేటి భాలీవుడ్ భామలకే గ్లామర్ విషయంలో సవాల్ విసురడం తన స్టైల్. తాజాగా శిల్పాజీ ఓ సాహసోపేతమైన ఆసనం వేసి మరోసారి సోషల్ మీడియాలో హైలైట్ అయింది. కాలి వేళ్లు నేలపై ఆన్చి..చేతుల సాయంతో శిరస్సు సహా బాడీ మొత్తాన్ని గాల్లోకి లేపింది.
ఇది చాలా కఠినమైన యోగాసనం. శరీరం బరువంతా ఆ వేళ్లపైనా..చేతులపైనే ఆధారపడుతుంది. ఇలాంటి ఆసనాలు వేయాలంటే చాలా అనుభవం ఉండాలి. ప్రాక్టీస్ లేకుండా ఇలాంటి రిస్క్ లు తీసుకుంటే? ఇలాంటి ఆసనాలు వేస్తే నడ్డి విరిగుతుంది అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఆసనాలు నిపుణుల సమక్షంలో మాత్రమే ప్రయత్నించండి… శిల్పా శెట్టి వేసిందని మనం సాహసాలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. గతంలో ఇలా రిస్కీ ఆసనం ఒకటి శిల్పా శెట్టి వేసింది. దానిపై నెటిజనులు తీవ్రంగానే విమర్శలు గుప్పించారు. సెలబ్రిటీలు ఇలాంటి వాటిని షేర్ చేయకూడదని… షేర్ చేయడం వల్ల వాటిని అనుకరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయినా శిల్ప వాటిని పెడ చెవిన పెట్టి తన పనిలో బిజీగా ఉంది.