ఎన్టీఆర్ లవ్ ట్రాక్ పై  క్రేజీ అప్ డేట్  !    

గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో  ‘ఎన్టీఆర్ –  రామ్ చరణ్’ హీరోలుగా  రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’.  ఈ సినిమాలో  ఎన్టీఆర్ కి  జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను  తీసుకున్న సంగతి తెలిసిందే.  కాగా  ఎన్టీఆర్ – ఒలివియా లవ్ ట్రాక్ కి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్  అప్ డేట్ తెలిసింది.  ఎన్టీఆర్ ప్రేమ కోసం ఒలివియా  తమ దేశం పైన,  తన తల్లిదండ్రుల పైనే పోరాడుతుందట.  పైగా వీరి లవ్ ట్రాక్ లో ఎక్కడా టాకీ పార్ట్ ఉండదని..  కేవలం వారి మధ్య  చోటు చేసుకున్న సంఘటనలతోనే ఒలివియా,  ఎన్టీఆర్ పై ఘాడమైన ప్రేమను పెంచుకుంటుందని.. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం  ప్రాణాలు ఇస్తుందని..  ఎన్టీఆర్ – ఒలివియా ట్రాక్ మొత్తం రాజమౌళి  చాల కొత్తగా ప్లాన్ చేశాడని తెలుస్తోంది. 

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకు మిస్ అయిన తారక్ ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? ఆ  వీడియోలో  ఎన్టీఆర్  ఎలా కనిపించబోతున్నాడు  ?  ఇంతకీ జక్కన్న ఎలాంటి వీడియోను  రిలీజ్ చేయనున్నాడు ? అని ఇలా ఎన్టీఆర్ పై  వీడియో రిలీజ్ కోసం  ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇక సినిమాలో ఎన్టీఆర్ మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట.   అన్నట్టు  ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ తాలూకు విజువల్ ఒకటి ఆ మధ్య బయటికొచ్చింది.  ఈ ఫైట్ అడవి పులికి,  ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. దానిలో ఎన్టీఆర్ గెటప్ చాల బాగుంది.   
 
అలాగే ఈ సినిమాలో డైలాగ్ లు కూడా అద్భుతంగా ఉంటాయని..  ఈ సినిమాలో  ప్రధాన హైలెట్స్ లో  ఎన్టీఆర్ డైలాగ్ లే  మెయిన్  హైలెట్ అవుతాయట.  తెలంగాణ యాసలో తారక్ పలికే డైలాగ్ లు చాలా గొప్పగా  ఉంటాయట.  డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య  ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  కాగా  ‘బాహుబలి’ తరవాత   రాజమౌళి  చేస్తున్న మరో భారీ సినిమా కావడంతో  అన్ని ఇండస్ట్రీల నుండి ఈ చిత్రం  పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.