ఎన్టీఆర్ బయోపిక్ , యాత్ర విడుదల అప్పుడే

బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మొదటి భాగం జనవరి 9 న విడుదలవుతుంది . ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు.  మొదటి భాగం లో ఎన్టీఆర్ సినిమా జీవితం ఉంటుందని అందుకే దీనికి “ఎన్టీఆర్ మహానటుడు ” అన్న టైటిల్ నిర్ణయించారు .

ఇక రెండవ భాగానికి “ఎన్టీఆర్  మహా నాయకుడు ” అనే పేరు పెట్టారు . ఇందులో రామారావు రాజకీయ జీవితానికి సంబంధించి ఉంటుందని  దర్శకుడు తెలిపాడు . ఈ సినిమా ఫిబ్రవరి  7న విడుదలవుతుంది . ఇటీవలే ఈ సినిమా ఆడియో  కార్యక్రమం జరిగింది .ఈ సినిమాలో హేమా హేమీలు నటిస్తున్నారు .

ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై మమ్ముట్టి కథానాయకుడుగా నిర్మిస్తున్న “యాత్ర ” సినిమా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా తయారవుతుంది . మహి వి రాఘవ దర్శకత్వంలో  విజయ్ చిల్లా , శశిదేవి రెడ్డి నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారని విషయం తెలియడం లేదు .

ఈ సినిమా ఆడియో కార్యక్రమం  జనవరిలో ఉంటుందని , యాత్ర సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు . ఎన్టీఆర్ బయోపిక్  ఫిబ్రవరి 7 న విడుదలవుతుంటే యాత్ర 8 న విడుదల కావడం విశేషం . ఇద్దరు మహా నాయకులే. ఇద్దరు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసినవారే  కావడం , ఒక్క రోజు తేడాతో రిలీజ్ కావడం గమనార్హం .