ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పై రాజమౌళి మౌనమేల?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుదిరం] సినిమాపై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, నందమూరి తారక రామారావు కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే రామ్ చరణ్ కి సంబందించిన వీడియో తన పుట్టిన రోజున విడుదల అయిన సంగతి తెలిసిందే.

భీమ్ ఫర్ రామరాజు అంటూ విడుదల అయిన వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ అభిమానులకు పెద్ద పండుగ వాతావరణం నెలకొల్పారు రాజమౌళి. అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియో లేదా ఫస్ట్ లుక్ ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున రాజమౌళి సర్ప్రైజ్ ఇస్తారు అనుకుంటే, లాక్ డౌన్ కారణంగా ఇవ్వలేక పోతున్నాం అనే విషయం బయటపెట్టారు.

అయితే లాక్ డౌన్ తర్వత పరిస్థితులు పూర్తి స్థాయిలో మారి పోయాయి. అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియో లేదా ఫస్ట్ లుక్ ప్రస్తుతానికి రాజమౌళి పోస్ట్ పోన్ చేసినా, ఇక దీని పై క్లారిటీ అయితే రాలేదు. ఆగస్ట్ నెలలో దీనికి సంబంధించిన వీడియో విడియో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఎన్టీఆర్ అభిమానుల సహనానికి రాజమౌళి పెడుతున్న గట్టి పరీక్షే ఇది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పై రాజమౌళి  మౌనమేల? అని కూడా జోకులేసుకుంటున్నారు.