ఈ కన్యను తాకితే మరణం తప్పదు

‘రాజుగారి గది 3’ట్రైలర్ వచ్చేసింది

రాజుగారి గది సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు ఓంకార్ ,సెకండ్ సీక్వెల్ తో కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి భయంతో కూడిన నవ్వులు పంచటానికి రాజుగారి గది 3తో రెడీ అవుతున్నాడు. అవికా గోర్ సినిమాలో డిఫరెంట్ లుక్ లో నటిస్తోంది.అలీ, బ్రహ్మాజీ, ధనరాజ్‌, అజయ్‌ ఘోష్‌, ఊర్వశి, హరితేజలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా సీనియర్‌ హీరో విక్టరి వెంకటేష్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ విజువల్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. షబీర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Raju Gari Gadhi 3 Official Trailer || 4K || Ohmkar, Avika Gor, Ashwin Babu || 2019

ఓంకార్ సోదరుడు అశ్విన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక త్వరలో సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో అవికా గోర్ పాత్ర పై ఓ వర్గం ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. ట్రైలర్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ఈ ట్రైలర్‌లో శరీరంలోకి ఆత్మ ప్రవేశించిన ఓ అమ్మాయి పాత్రలో అవికాగోర్‌ భయపెట్టింది. ‘ఈ కన్యను తాకాలని చూస్తే నీకు తప్పదు మరణం’ అని అవికాగోర్‌ను ఉద్దేశిస్తూ అశ్విన్‌బాబు చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి.

హారర్‌ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించారు. కానీ ఓ బాలీవుడ్‌ సినిమా కోసం తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో చేసేదేమి లేక మరో హీరోయిన్‌తో సినిమాను కంటిన్యూ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే తమన్నా లాంటి గ్లామరస్‌ స్టార్‌ను తీసుకోవాలనుకున్న ప్లేస్‌లో ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేం అవికా గోర్‌ను తీసుకున్నారు. అవికా టాలీవుడ్‌ను వదిలేసి చాలా కాలం అవుతుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కనిపించినా అది అతిథి పాత్రే. మరి ఈ సమయంలో అవికా రాజుగారి గది 3కి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.