ఆ లేడీస్ కి లాక్ డౌన్ ఇబ్బందులా?

హీరో ఫామ్‌హౌస్‌లో బ్యాడ్‌గాళ్ వారంపాటు లాక్డ్

లాక్ డౌన్ తో కూలీలు..పేద‌లే కాదు.. కొంత మంది బుల్లి తెర న‌టులు…చిన్న చిన్న వేషాలు వేసుకునే వారు సైతం ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. షూటింగ్ లు లేక ప‌ని లేక పోవ‌డంతో చిన్న చిన్న చిత్రాల్లో సైడ్ క్యారెక్ట‌ర్ పోషించే ఆర్టిస్టులు అష్ట‌క‌ష్టాల్లోఉన్న‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా సినిమాల్లో ఎద‌గాల‌ని సొంతూళ్ల‌ను..కుటుంబాల‌ను వ‌దిలేసి వ‌చ్చిన ఆడ‌వాళ్లు బాగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు చిత్ర‌పురి వ‌ర్గాలు అంటున్నాయి. చిన్న సినిమాల్లో కొంత మంది ఆర్టిస్టుల‌కు ఏ రోజుకి ఆరోజే డ‌బ్బులు చెల్లిస్తారుట. రోజంతా షూటింగ్ చేసి సాయంత్రం అయ్యే స‌రికి చిన్న న‌టీన‌టులంద‌రికీ పేమెంట్ చ‌సేస్తారుట‌.

ఇప్పుడు అలాంటి వారంతా బాగా ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. అయితే వీళ్లు సేవింగ్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఇప్పుడు ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు మాట్లాడుకుంటున్నారు. ఏ రోజు సంపాదించింది ఆరోజు జ‌ల్సాల‌కి స‌రిపోతుంద‌ని..పొద్దున లేచి మ‌ళ్లీ ఎక్క‌డ మొద‌లైన జీవితం అక్క‌డే ఉంటుంద‌ని అందుకే ఇప్పుడు ఇబ్బందులు తప్ప‌లేద‌ని అంటున్నారు. అలాగే ఒక‌ప్పుడు సినిమాల్లో హీరోయిన్ల‌గా న‌టించి ప్ర‌స్తుతం బుల్లి తెర రియాల్టీ షోలు..డాన్సు షోల‌కు న్యాయ నిర్ణేత‌లు గా వ్య‌వ‌రిస్తోన్న కొంత మంది హీరోయిన్లు ఇబ్బందులు ప‌డుతున్నారుట‌.

ఊహించ‌ని విప‌త్తు కార‌ణంగా అల‌వాటైన జీవితం నుంచి ఒక్క‌సారిగా విప‌త్క‌ర ప‌రిస్థితులు త‌లెత్తి షోలు ఆగిపోవ‌డంతోనే ఇన్ని ఇబ్బందుల‌ని చెబుతున్నారు. ఇలాంటి వాళ్ల‌కి కూడా స‌హాయం చేయాల్సిన బాధ్య‌త సినిమా వాళ్ల‌పై..ప్ర‌భుత్వాల‌పై ఉంద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అయిత ఇప్ప‌టి మెగాస్టా చిరంజీవి సీసీసీ పేర‌టి ఓ చారిటీ ఏర్పాటు చేసి నిధుల‌ను సేక‌రిస్తున్నారు. సినీ కార్మికుల‌కు అవ‌స‌ర‌మైన నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపీణి చేయ‌డం కూడా ప్రారంభించారు. ఆ జాబితాలో ఇలాంటి వాళ్ల‌ని కూడా చేర్చితే కొంత మేర వాళ్ల క‌ష్టాలు తీరే ఛాన్స్ ఉంటుంది. మ‌రి ఆ విధంగా సీసీసీ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆశిద్దాం.