గీతా ఆర్ట్స్, జీఏ2 సంస్థలు అల్లు శిరీష్‌ని మర్చిపోయాయా?. బయటి వాళ్లతో వరుస సినిమాలు నిర్మిస్తూబిజీగా వున్న ఈ సంస్థలు సొంత మనిషిని పట్టించుకోవడం లేదా? అంటే టాలీవుడ్లో దీనిపై చర్చ జరుగుతోంది. పరశురామ్ రూపొందించిన `శ్రీరస్తు శుభమస్తు` చిత్రంతో హిట్‌ని సొంతం చేసుకున్నడు అల్లు శిరీష్ ఆ తరువాత మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పాడని తెలుగు నేటీవిటీకి ఎక్కని కథని మలయాళం నుంచి తీసుకుని చివరికి అదే పేరుతో (ఏబీసీడీ) సినిమా చేశాడు.
ఆ మూవీ ఎలా వచ్చిందో.. ఎప్పుడు వచ్చిందో.. ఎలా వెళ్లిందో కూడా ఎవరికి తెలియదు. గత ఏడాది మే 17న అల్లు శిరీష్ నటించిన `ఏబీసీడీ` విడుదలైంది. దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అతని నుంచి మరో సినిమా ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. కానీ ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా వుంటే `ఆహా` ఓటీటీలో వరుసగా వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తూ అల్లు అరవింద్ యమ బిజీ అయిపోయారు. మరో పక్క వరుసగా బయటి హీరోలతో సినిమాలు నిర్మిస్తూ బన్నీవాసు కూడా బిజీ అయిపోయాడు.
బయటి వాళ్లపై కోట్లు ఖర్చు చేస్తూ సినిమాలు చేస్తున్న బన్నీవాసు మరి శిరీష్‌తో ఎందుకు సినిమా చేయడం లేదన్నది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. అంటే శిరీష్ సినిమాలు ఆపేయాలనా?. లేక అతనికి తగ్గ కథ బన్నీ వాసు వద్దకు రాలేదనా? లఏదంటే `ఆహా` ఓటీటీ బాధ్యలు అప్పగించి ఇక సినిమాలు వదిలేయమని అల్లు శిరీష్‌కి ఇండైరెక్ట్ సంకేతాలిస్తున్నారా? అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.