Eesha : మూడు రోజుల్లో ‘ఈషా’ బ్రేక్‌ఈవెన్‌.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఈషా ఈ రోజు నుంచి లాభాల బాటలోకి…

Eesha : ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి వంటి బ్లాక్‌బస్టర్స్‌ అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘ఈషా’అనే హారర్‌ థ్రిల్లర్‌ను అందించారు. ఈ క్రిస్మస్‌కు విడుదలైన ఈ చిత్రం ఈ క్రిస్మస్‌ విజేతగా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రంతో ఈ మిత్రద్వయం హ్యట్రిక్‌ విజయాలను అందుకున్నారు. విడుదలైన మూడు రోజుల్లో 4 కోట్ల 80 లక్షల గ్రాస్‌ను వసూలు చేసిన బ్లాక్‌బస్టర్‌ ‘ఈషా’ చిత్రం ఈ రోజు నుంచి లాభాల బాటల్లో అడుగుపెట్టింది.

పెయిడ్‌ ప్రీమియర్స్‌ దగ్గర నుంచే స్ట్రాంగ్‌ కలెక్షన్స్‌తో అద్బుతమైన ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన ‘ఈషా’ బ్లాక్‌బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు రోజు రోజుకు కలెక్షన్స్‌ పెంచుకుంటూ ఈ క్రిస్మస్‌ విజేతగా నిలిచింది. రానున్న రోజుల్లో ఈషా బాక్సాఫీస్‌ వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్‌ చేస్తుందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. అఖిల్‌రాజ్‌ త్రిగుణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

బాబుకు అప్పుల ఆస్కార్ || Congress Tulasi Reddy EXPOSED RBI Report On AP Debts || Chandrababu || TR