`అర్జున్‌రెడ్డి`తో ఊహించని క్రేజ్‌ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలో సడన్‌గా ఎదిగిన యువ కెరటం. గత కొంత కాలంగా క్రేజీ హిట్‌లతో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నాడు. రౌడీ బ్రాండ్‌తో తన ఇమేజ్‌నే బ్రాండ్‌గా మార్చుకుని యూత్‌లో హ్యూజ్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకన్నాడు. అయితే గత కొంత కాలంగా ఆ క్రేజ్ తగ్గుతూ వస్తోంది. నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలు ఊహించని విధంగా ఫ్లాప్‌లుగా మారాయి. తాజాగా రిలీజ్ అయిన `వరల్డ్ ఫేమస్ లవర్` కూడా తొలి రోజు నుంచే డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
దీనికి విమర్శకులు కూడా తోడవ్వడంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా విజయ్ క్రేజ్‌కి తగ్గ స్థాయిలో రాలేదు. దీంతో నిర్మాతకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. రౌడీ ఫ్యాన్స్ నుంచి కూడా విజయ్ దేవరకొండకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. దీంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. వీకెండ్ ఈయినా కూడా రెండవ రోజు వసూళ్లు దారుణంగా పడిపోవడంతో ట్రేడ్ వర్గాలు అవాక్కవుతున్నారట. ఎంత ఫ్లాప్ సినిమారైనా ఇంత దారుణంగా కలెక్షన్‌లు పడిపోయిన సందర్భాలు లేవని చెబుతున్నారు. రెండు రోజులకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సాధించింది 8 కోట్ల షేర్ మాత్రమే. ఇది నిజంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఒక విధంగా చెప్పాలంటే డేంజర్ బెల్స్ మొదలైనట్టే నని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.