తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ `తలైవి` టైటిల్ తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో అమ్మ పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే కొద్ది భాగం చిత్రీకరణ పూర్తయింది. అయితే అమ్మ జీవితంలో చాలా ఆసక్తికర సంగతులే ఉన్నాయి. రాజకీయంగా..వ్యక్తిగతంగా ఆమె జీవితంలో చాలా మంది కీలక వ్యక్తులున్నారు. ముఖ్యంగా జయలలిత- నట భూషణ్ శోభన్ బాబు కలిసి ఎన్నో సినిమాలు చేసారు. ఈ నేపథ్యంలో ఇద్దరి గురించి కొన్ని రూమర్లు అప్పట్లో వేడెక్కించాయి. ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా జన్మించిందని అప్పట్లో సంచలనమైంది.
తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందని అప్పటి మీడియా కథలు కథలుగా రాసింది. అయితే అమ్మ అభిమానులను దృష్టిలో పెట్టుకుని మనోభావాలు దెబ్బ తినకుండా అలాంటి సన్నివేశాలను..శోభన్ బాబు పాత్రను ఆవిధంగా ఫోకస్ చేయకుండా తెరకెక్కించాలని చూస్తున్నారుట. కేవలం ఆ ఇద్దరు కలిసి నటించిన సినిమాల వరకే సన్నివేశాలుంటా యని..వ్యక్తిగత విషయాల జోలికి దర్శకుడు వెళ్లబోవడం లేదని కోలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. అదే నిజమైతే సినిమాకు ఇది పెద్ద మైనస్ అవుతుంది. బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి.
మరీ నెగిటివ్ కాకపోయినా..ప్రతీ ఒక్కరిలో నెగిటివ్ యాంగిల్ ఒకటి ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పక టచ్ చేయాల్సిందే. ఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడానికి ప్రధాన కారణంగా ఆయనలో ఒక యాంగిల్ నే చూపించరని…మరో పార్శవాన్ని చూపించలేదని…అందుకే ఆసినిమా ఆసక్తికరంగా లేదని క్రిటిక్స్ సహా ప్రేక్షకులు పెదవి విరిచేసారు. ఇప్పుడు అమ్మ బయోపిక్ లోనూ నెగిటివిటీ జోలికి వెళ్లకుండా ఒక కోణాన్నే ఫోకస్ చేస్తున్నట్లు తాజా కథనాన్ని బట్టి తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అన్నది యూనిట్ ధృవీకరించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఏ.ఎల్ విజయ్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.