లాక్ డౌన్ నేపథ్యంలో సెలబ్రిటీలలో కొందరు ఖర్చు లేని సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా రూపాయి ఖర్చు లేకుండానే ప్రచారానికి ప్రచారం..సామాజిక సేవ చేసినట్లు కనిపిస్తోంది. సహజంగానే ఒకరు క్రియేటివ్ గా చేస్త్ దానిని అనుకరించడం టాలీవుడ్ వాళ్లకు బాగా అలవాటైన పని. స్టే హోమ్…స్టే సేఫ్ అంటూ పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే కొన్ని వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అనసూయ, రవి, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా సహా పలువురు సెలబ్రిటీలు అలాంటి ప్రయత్నమే చేసి చేతులు కాల్చుకున్నారు. హై అండ్ సీక్ అనే షార్ట్ ఫిల్మ్ తీసారు. ఇంత వరకూ బాగానే ఉంది.
మంచి అవేర్ నేస్ తీసుకొచ్చే వీడియోనే. కాకపోతే ఇందులో ఓ సీన్ లో అనసూయ మంచం పై ఫోన్ తో చాలా బిజీగా ఉంది. అదే సమయంలో యాంకర్ రవి అనయసూయ మంచం కింద ఉన్నాడు. గేమ్ లో భాగంగా మంచం కింద నుంచి రవి బయటకొస్తే..నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని అనసూయ అంటుంది. దానికి సమాధానం చెప్పకుండా రవి తిరిగి ప్రశ్నిస్తాడు. అప్పుడు అనసూయ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానంటుంది. రవి కూడా నేను కూడా అదే పనిలో ఉన్నానంటాడు. ఆ డైలాగులు సోషల్ మీడియాలో మరోలా వైరల్ అవుతున్నాయి.
అసలు ఇద్దరు ఏం చేస్తున్నారో? చెప్పకుండా ఇంపార్టెంట్ పని అంటున్నారు? తప్ప అంత ఇంపార్టెంట్ పని ఏంటో? అర్ధం కాలేదంటూ నేటి జనులు కామెంట్లు పెడుతున్నారు. అనసూయ ఫోన్ దాచేసుకుని మరీ ఇంపార్టెంట్ పని అంటుంది? ఏంటి సంగతి? ఫోన్ లో సీక్రెట్ గాఏం చేస్తున్నావ్? రవికి అనసూయ మంచం కింద అంత ఇంపార్టెంట్ పని? ఏంటి అంటూ కొంత మంది ఆకతాయిలు కామెంట్లు పెడుతున్నారు. వీటికి అనసూయ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. గతంలోనూ అనసూయ డ్రెస్సింగ్ సెన్స్ పై చాలా హాట్ కామెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కామెంట్లు పెద్ద వివాదంగా మారాయి. మరి ఈసారి అంత దూరం వెళ్తుందా? అన్నది చూడాలి.