మలయాళీ పాప అను ఇమ్మాన్యేయేల్ టైమ్ బ్యాడ్‌గా నడుస్తోంది. ఏ సినిమా చేసినా కలిసి రావడం లేదు. నేచురల్ స్టార్ నాని నటించిన `మజ్ను` సినిమాతో చూడ్డానికి ఎంత బాగుంది అనిపించిన అను యాక్టింగ్ వరకు వచ్చే సరికి ఇంతేనా? అనిపించింది. దీనికి తోడు అను చేసిన ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శైలజారెడ్డి అల్లుడు.. ఇలా స్టార్‌లతో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాపులుగా నిలిచాయి.
దీంతో అను కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోయింది. తెలుగులో కలిసిరావడంలేదని తమిళ్‌కి చెక్కేసినా అక్కడా అదే పరిస్థితి. ఒక్క `తుప్పరివాలన్` తప్ప అను ఇమ్మాన్యుయేల్‌కి అక్కడ ఒక్క హిట్టు దక్కలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్‌నే నమ్ముకోవాలనుకుంటోంది. మళ్లీ తెలుగులో బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అనుకుతగిలిన హీరో అల్లు శిరీష్. `ఏబీసీడీ` ఫ్లాప్ తరువాత మరో సినిమా అంగీకరించని శిరీష్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ని ఫిక్స్ చేశారట. మరి ఈ సినిమా అయినా ఇద్దరికి హిట్టిస్తుందో చూడాలి.