అనుష్క బ‌యోపిక్ చేయ‌బోతోందా?

బ‌యోపిక్‌ల హంగామా న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులు, సినీ స్టార్స్‌, స్పోర్ట్స్ మెన్‌ల‌కు సంబంధించిన విజ‌య గాధ‌ల్ని తెర‌పైకి బ‌యోపిక్‌లుగా తీసుకొచ్చారు. అందులో చాలా వ‌ర‌కు విజ‌యాన్ని సాధించాయి. ఇటీవ‌ల తెలుగులో సావిత్రి బ‌యోపిక్ `మ‌హాన‌టి`తో బ‌యోపిక్‌ల ప‌రంప‌ర మొద‌లైంది. కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ మాత్రం నిరాశ ప‌రిచింది.

త్వ‌ర‌లోనే ఓ గాయ‌ని జీవిత క‌థ‌ని దిగ్రేట్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస‌రావు సినిమా చేయ‌బోతున్నారు. బెంగ‌ళూరుకు చెందిన దేవ‌దాసి నాగ‌ర‌త్న‌మ్మ క‌థ‌తో ఈ బ‌యోపిక్ తెర‌పైకి రాబోతోంద‌ట‌. దేవ‌దాసి నుంచి గాయ‌నిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న నాగ‌రత్న‌మ్మ జీవిత చ‌ర‌మాంకంలో యోగినిగా మారింది. ఆమె క‌థ‌ని ఇండియ‌న్ తెర‌పై కొత్త పంథాలో ఆవిష్క‌రించాల‌ని ద‌ర్శ‌కుడు సింగీతం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ క‌థ‌ని అనుష్క‌కు వినిపించార‌ట‌.

సింగీతం లాంటి ద‌ర్శ‌కుడు త‌న‌తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌డంతో అనుష్క వెంట‌నే ఈ చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది.