అక్ష‌య్‌ని కుమ్మేసిన విద్యాబాల‌న్‌

బాలీవుడ్ క్రేజీ ఫొటో గ్రాఫ‌ర్ డ‌బ్బూ ర‌త్నానీ రూపొందించిన న్యూ ఇయ‌ర్ క్యాలెండ‌ర్‌లో హాట్ హాట్ పోజుల‌తో ర‌చ్చ చేసింది విద్యాబాల‌న్‌. అయితే ఆ ఫొటోల్లో వున్న ని‌జ‌మెంతో తెలియ‌దు కానీ తాజాగా ఈ డ‌ర్టీపిక్చ‌ర్ హీరోయిన్ యాక్ష‌న్‌, అండ్ కామెడీ హీరో అక్ష‌య్‌కుమార్‌ని మాత్రం కుమ్మేసింది. పిచ్చి పిచ్చిగా త‌న్నేసింది. ఒక్క‌సారిగా అక్ష‌య్‌పై విరుచుకుప‌డింది.

పిడి గుద్దుల‌తో అక్ష‌య్‌ని మ‌ట్టి క‌రిపించింది. చివ‌రికి చెప్పుకోలేని చోట కిక్ ఇచ్చి అక్ష‌య్‌ని క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ వీడియోని సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్ష‌య్‌పై విద్యాబాల‌న్ ముష్టిఘాతాలు కురిపిస్తున్న దృశ్యాలు నెటిజ‌న్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. వీడియో ప్రారంభంలో చూసిన వాళ్లు ఆశ్చ‌ర్య‌పోతుంటే ఎండింగ్ చూసిన వాళ్లంతా పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతున్నారు.

అక్ష‌య్‌కుమార్, విద్యాబాల‌న్ క‌లిసి కొన్ని నెల‌ల క్రితం ‌`మిష‌న్ మంగ‌ళ్‌` చిత్రంలో న‌టించారు. సొనాక్షీ సిన్హా, నిత్యామీన‌న్‌, తాప్సీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో స‌ర‌దాగా విదా్య‌బాల‌న్‌, అక్ష‌య్‌కుమార్ డ‌మ్మీ ఫైట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని తాజాగా విద్యాబాల‌న్ షేర్ చేసింది. లాక్ డౌన్ వేళ ఇంటి ప‌ట్టునే వుంటున్న విద్యాబాల‌న్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న న‌టీన‌టుల్ని మిస్స‌వుతున్నానని పోస్ట్ చేసింది.