అక్టోబర్‌లో అధర్వ హీరోగా వస్తున్న ‘బూమరాంగ్‌’

తమిళ యువ కథానాయకుల్లో అధర్వ మురళి ఒకరు. అనువాద చిత్రం ‘అంజలి సీబీఐ’ తర్వాతా వరుణ్‌తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌’లో దర్శకుడు కావాలనుకునే యువకుడిగా అధర్వ మురళి అద్భుతంగా నటించారు. త్వరలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అధర్వ మురళి కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బూమరాంగ్‌’. మేఘా ఆకాష్‌, ఇందూజ రవిచంద్రన్‌ కథానాయికలు. ఆర్‌. కణ్ణన్‌ దర్శకత్వం వహించారు. సి.హెచ్‌ సతీష్‌కుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. త్వరలో పాటల్ని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ అధర్వ మురళి అద్భుతంగా నటించారు. ‘అందాల రాక్షసి’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు’ చిత్రాల్లో పాటలతో తెలుగు ప్రేక్షకులను వీనులవిందైన స్వరాలను అందించిన రధన్, ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో పాటల్ని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’
అన్నారు.