కమర్షియల్ హీరోగా స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న అక్కినేని అఖిల్ తన తర్వాతి సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి సైతం అఖిల్ లో ఉన్న మాస్ హీరోను బయటికి లాగుతాను అంటూ ప్రకటించేశారు. అసలు అఖిల్ ను దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
‘రేసు గుర్రం’ సినిమాతో అల్లు అర్జున్ యాక్షన్ హీరోగా ఎంత బాగా ఎస్టాబ్లిష్ అయ్యారో తాను చేయబోయే సినిమాతో అఖిల్ అలాగే యాక్షన్ ఇమేజ్ తెచ్చుకుంటారని అన్నారు. ఆయన మాటల్ని బట్టి చూస్తే ఈ స్పై థ్రిల్లర్సి నిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమైంది. అంతేకాదు సినిమాకు హెవీ బడ్జెట్ అనుకుంటున్నారు.
అసలు కాస్టింగ్ విషయంలోనే ఔరా అనిపించాలనుకుంటున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అప్రోచ్ అవుతున్నారట. అది కూడ ఒక స్పై పాత్రకు. ఒక సూపర్ స్టార్ స్పై పాత్రను చేయడానికి సుముఖంగా ఉన్నారంటే ఆ పాత్ర స్టామినా ఏంటో ఊహించవచ్చు. సినిమాలో మోహన్ లాల్ చేసేది లీడ్ రోల్ కాకపోయినా ఆయన రెమ్యునరేషన్ తగ్గదు. ఒక ఫుల్ లెంగ్త్ సినిమాకు ఇచ్చినంతే ఇవ్వాలి. అంటే అందరికంటే ఆయన పారితోషకమే ఎక్కువ. అయినా సురేందర్ రెడ్డి వెనక్కు తగ్గట్లేదు అంటే సినిమా లెవల్ పెద్దదే అనుకోవాలి.