NTR : కొరటాలతో సినిమా ఇలా ఉండబోతుందో చెప్పిన ఎన్టీఆర్…ఆలియా తో జత కట్టనున్న యంగ్ టైగర్…!

NTR : ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఆస్వాదిస్తున్నా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ కాంబినేషన్ లో చేయనున్నాడు. అయితే ఇంకా ఎటువంటి సమాచారం ఈ సినిమా గురించి తెలియదు వేసవి అనంతరం ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం తారక్ 8కేజీ ల బరువును కూడా తగ్గాలనుకుంటున్నారట. అందుకు కోసం ఫుల్ డైట్ లో ఉన్నాడట ఎన్టీఆర్.

ఇక ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన పలు ఇంటర్వ్యూ ల్లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ చిత్రం గురించి ప్రశ్నించగా ఎన్టీఆర్ వివరాలను తెలిపారు. కొరటాల తో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా లో హీరోయిన్ గా ఆలియా భట్ నటించనుంది. ఇక అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు.
సినిమా కథ విషయానికి వస్తే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అభిమానులకు నచ్చుతుందని ఎన్టీఆర్ చెప్తున్నారు.అసలే ఆర్ఆర్ఆర్ లో తన పాత్రను తగ్గించారాని అసంతృప్తి తో ఉన్న అభిమానులకు కొరటాల సినిమా అయినా సంతృప్తి పరుస్తుందో లేదో చూడాలి. ఇక యువ సంగీత కెరటం అనిరుధ్ పాటకి ఇక ఎన్టీఆర్ డాన్సు తోడైతే రచ్చే ఇంక….