బాలీవుడ్ సినిమా ‘అంధాదున్’ ఎంతటి పెద్ద విజయం సాధించిందో చెప్పేదేముంది. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయడం కోసం ఇక్కడి నిర్మాతలు, హీరోలు పోటీలు పడ్డారు. తెలుగులో ప్రస్తుతం థ్రిల్లర్ల హవా నడుస్తుండడం ఆ సినిమాలు కాసుల పంట కురిపించడం కూడా దీనికి కారణమే.
తెలుగులో అడివి శేష్, నాని మొదలైన వారు ఈ సినిమా రీమేక్ రైట్ల కోసం పోటీ పడ్డా చివరికి హీరో నితిన్ చాలా పెద్ద మొత్తానికి ఆ సినిమా రీమేక్ రైట్లను దక్కించుకున్నారట. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు వయాకామ్ 18 సంస్థ సంయుక్తంగా దక్కించుకున్నారట. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.