ఒకప్పుడు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలయ్య మొదలైన వాళ్ళకి వారి సినిమా విడుదల సందర్బంగా పెద్ద పెద్ద కటౌట్ లు పెట్టే వారు. ఇలాంటిదే ఒక హీరోయిన్ కు జరగడం అనేది కొద్దిగా అరుదనే చెప్పాలి. అది కూడా ఈ మల్టీప్లెక్స్ కాలంలో. కానీ అక్కినేని వారి కోడలు ఆ అరుదైన ఘనతను అందుకుంది. ఆమె నటించిన ‘ఓహ్ బేబీ’ సినిమా విడుదల అవుతున్న సందర్బంగా పెద్ద కటౌట్ ను ఒక థియేటర్ ముందు కట్టారు. అది చూసి సమంత సైతం ఆశ్చర్యానికి లోనైంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 5 న విడుదల అవుతోంది. నాగ సూర్య ఈ చిత్రంలో హీరోగా నటించారు.
హీరోలతో సమానంగా సమంత కటౌట్
