ఈ మధ్య మన సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఆదరణ ఉంది. అక్కడి స్టార్ హీరోలు ఏరి కోరి మన సినిమాలను రీమేక్ చేస్తున్నారు అలాగే ఇక్కడి డైరెక్టర్లకు కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ రీమేక్ సినిమా యొక్క ఫీల్ పోకుండా ఉండాలంటే అదే డైరెక్టర్ ఉండాలని పట్టుబడుతున్నారు. అలా మన కాంచన డైరెక్టర్ లారెన్స్ హిందీ లో తెరంగేట్రం చేస్తున్నారు.
తాజాగా తెలుగులో విడుదల అయ్యి మంచి విజయం సాధించిన నాని ‘జెర్సీ’ పై హిందీ నిర్మాత కరణ్ జోహార్ కన్ను పడింది. ఈ సినిమా రీమేక్ రైట్లను కొని సినిమాను నిర్మించే పనిలో ఉన్నారు. దర్శకుడిగా మాతృకను తీసిన గౌతమ్ తిన్ననూరి ఉండే అవకాశం ఉంది. అయితే హీరోగా ఎవరు నటిస్తారో ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు ఒప్పందం జరిగినట్టు సమాచారం.
