స్టార్ డైరెక్టర్ ఇంటిని కూల్చేసిన హెచ్ఎం.డీ.ఏ అధికారులు

విధి వక్రిస్తే ఎంతటి వారికైనా వారి శ్రమ ఫలించదు. అలాగే వారి కళలు కల్లలు అవుతాయి. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. స్టార్ డైరెక్టర్ వీ. వీ. వినాయక్ ఇంటిని హెచ్ఎం.డీ.ఏ అధికారులు కూల్చేశారు.

వివరాల్లోకి వెళ్తే, వినాయక్, రింగ్ రోడ్ కు దగ్గరలో వట్టినాగుల పల్లిలో ఒక ఇంటిని నిర్మించుకుంటున్నారు. అయితే ఈ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం నుంచి ఎన్ని నోటీసులు వచ్చినా దానికి స్పందించలేదు. దానితో అధికారులు నిర్మాణంలో ఉన్న ఆ ఇంటిని కూల్చేశారు. పాపం ఎంత వారికైనా తప్పదు ఇటువంటి తిప్పలు.