సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం వెనక ముంబై మాఫియా డాన్ దావూద్ సన్నిహితుల బెదిరింపుల కోణం ఉందా? అంటే తాజాగా మాజీ రా అధికారి ఎన్.కె.సింగ్ అవుననే ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు కారణం తీవ్ర మానసిక ఒత్తిడి అని ముంబై పోలీసులు చెబుతున్నా.. అందుకు కారకుడు మాత్రం డాన్ దావూద్ సన్నిహితులేననేది ఆయన ఆరోపణ. అలాగే ఇందులో సుశాంత్ సింగ్ స్నేహితుడు సందీప్ సింగ్ సహా పలువురి హస్తం ఉందని ఆరోపించారు.
సుశాంత్ ని ఆత్మహతకు ప్రేరేపించింది దావూద్ సన్నిహితుల వాళ్ల ఫోన్ కాల్స్. చంపేస్తామని బెదిరించడం వల్లనే సుశాంత్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడని ఆ ఒత్తిడిలో అతడు ఏకంగా దావూద్ నుంచి తప్పించుకునేందుకు 50 సిమ్ కార్డులు మార్చాడని కూడా అతడు అన్నారు. ఈ కుట్రలో సుశాంత్ స్నేహితుడు సందీప్ సహా పలువురు బాలీవుడ్ పెద్దలు కూడా ఉన్నారని అటువైపు వేలెత్తి చూపారు.
అయితే ఈ ఆరోపణల్ని సుమోటాగా స్వీకరించి తిరిగి కేసును తిరగతోడతారా? ముంబై పోలీసులు మళ్లీ ఈ కోణంలో కూడా విచారిస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ అతడి ఆరోపణలు నిజమే అయితే సుశాంత్ సింగ్ ని మాఫియానే బెదిరించాల్సినంత అవసరం ఏం ఉందో కూడా తేలాల్సి ఉంది. తొలి నుంచి బాలీవుడ్ సినీపెద్దలు కుటుంబ హీరోలు దర్శకనిర్మాతల కుట్రలే ఈ దుర్మరణానికి కారణం అన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో దావూద్ పాత్ర ఏమిటన్నది మాత్రం స్పష్ఠత తేవాల్సినది పోలీసులే. ఇక డాన్ దావూద్ ఇబ్రహీం ఇంతకుముందు అనారోగ్యంతో విదేశాల్లోనే మరణించారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.