సుకుమార్‌కి కొత్త టెన్ష‌నా?

అల్లుఅర్జున్, మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈ చిత్రం విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. త్రివిక్ర‌మ్ త‌న‌దైన శైలిలో ఫ్యామిలీ ఎమోస‌న్స్‌తో పాటు మంచి క‌థ‌ను తీసుకుని తెర‌కెక్కించారు. ఇక ఇదిలా ఉంటే… అల్లుఅర్జున్ త‌న త‌ర్వాత చిత్రం సుకుమార్‌తో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌నేప‌థ్యంలో తెర‌కెక్కే చిత్ర‌మిది. ఈ చిత్ర క‌థాంశం కూడా `అల‌వైకుంఠ‌పురంలో` టైపులో అంద‌ర్నీ అల‌రించ‌నుంద‌ని స‌మాచారం.

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రంగ‌స్థ‌లం చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్. ఆ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌ను ఆయ‌న ఎంత ఊర‌మాస్‌గా చూపించారో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే ప్ర‌స్తుతం బ‌న్నీ ని అలా మాస్ లుక్‌లో కాకుండా స్టైలిష్‌గా ఎంతో రిచ్‌గా చూపించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఇక ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి నుండి షూటింగ్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఇక‌పోతే అల్లుఅర్జున్ గ‌తంలో దువ్వాడ జ‌గ‌న్నాధం, నాపేరు సూర్య చిత్రాలు మాస్ చిత్రాలుగా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి.

ఆయ‌న్ను జ‌నం స్టైలిష్‌గా చూసేందుకే ఇష్ట‌ప‌డుతున్నార‌ని దీన్ని బ‌ట్టి అర్ధం చేసుకున్నాడో ఏమోగాని సుక్కు బ‌న్నీని అలాగే స్టైలిష్ హీరోగా రిచ్‌గా చూపించాల‌నుకుంటున్నాడు. ఇక బ‌న్నీ సుకుమార్‌తో చేయ‌బోయే ఈ చిత్రం కూడా హిట్ టాక్ వ‌స్తేగ‌నుక మ‌ళ్ళీ బ‌న్నీ కెరియ‌ర్ ప‌ట్టాలెక్కిన‌ట్లే అనుకోవ‌చ్చు.