హీరోయిన్ ఇలియానా తెలుగు నాట ఎంత పేరు తెచ్చుకుంది చెప్పేదేముంది. ఆమె గ్లామర్ కి ప్రేక్షకులు దాసోహం అన్నా ఆమె బాలీవుడ్ బాట పట్టగా క్రమంగా ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు పూర్తిగా మర్చిపోయారనుకోండి. అయితే ఈ భామ హిందీలో పలు హిట్ సినిమాల్లో నటించి ఆనక ఆండ్రూ నీబోన్ తో సహా జీవనం మొదలు పెట్టింది. పెళ్లి అయింది అని నేరుగా చెప్పలేదు కానీ వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేసేది.
ఏమైందో ఏమో కానీ ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో స్టేటస్ సింగల్ కి వచ్చింది. ఆమె తన అకౌంట్ లో తన బాయ్ ఫ్రెండ్ ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేసింది. అంతే కాదు అతనూ ఇదే పని చేశారు. దాంతో ఇద్దరూ విడిపోయారు అని మనం అర్ధం చేసుకోవచ్చు. ఏంటో ఈ మధ్య విడిపోయాము అని చెప్పడానికి ఇదొక మార్గంలా ఉంది సెలెబ్రిటీలకి. పాపం ఇప్పుడు మళ్ళీ తెలుగు వైపు చూస్తోంది ఈ బ్యూటీ.