ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యాక్షన్ చిత్రం ‘సాహో’ మళ్ళీ విడుదల వాయిదా పడింది. ఈ సినిమా ఇప్పటికే రెండేళ్లు తీసుకోగా ప్రకటించిన తేదీ ఆగష్టు 15 న విడుదల కాలేకపోతుంది. కారణం ఏంటంటే, 300 కోట్ల బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వర పెడితే ఆ పైన ఫలితం సరిగా రాదేమోనని మరి కొంచెం సమయం ఎక్కువ తీసుకోవాలి అని అనుకున్నారట నిర్మాతలు. అందువల్ల ఈ సినిమా ఆగష్టు 30 న విడుదల కాబోతుంది.
ఒకరి నష్టం మరొకరికి లాభమైనట్టు. ప్రభాస్ వెనక్కి తగ్గగానే, శర్వా ముందుకు దూకాడు. అతని సినిమా ‘రణరంగం’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండడం వల్ల ఆగష్టు 15 న విడుదల అవుతుందని ఆ చిత్రం నిర్మాతలు ప్రకటించారు. మాఫియా నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వా ద్విపాత్రాభినయం చేయగా, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు.