టెట్ పరీక్ష వాయిదా వేయమన్న రేవంత్ రెడ్డి..

తాజాగా టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి రేపు జరగనున్న పరీక్షలపై స్పందించారు. రేపు ఆర్ఆర్బీ, టెట్ పరీక్షలో ఒకేరోజు ఉండటంతో.. రెండూ పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం సరికాదు అని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఒకే రోజు రెండు పరీక్షల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అని.. జాతీయ స్థాయి పరీక్ష ఆర్ఆర్బీ ఉన్నందున టెట్ పరీక్షలు వాయిదా వేయమని కోరారు. రాష్ట్ర పరిధిలో ఉన్న టెట్ ను మరో తేదీ లోపు నిర్వహించవచ్చని.. నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే టెట్ ను వాయిదా వేయాలి అని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం ఏం స్పందిస్తుందో చూడాలి.