‘సాహో’ పై బెట్టింగులు కాస్తున్న టాలీవుడ్?
* ఊహించని అంచనాలను అందుకుంటుందా?
* ‘బాహుబలి’ ని చేరుకుంటుందా?
* ఇవే బెట్టింగులు
ఓ పక్క భారీ బడ్జెట్.. మరో పక్క అంతే భారీ తారాగణం,, అంతకుమించి ప్రపంచ వ్యాప్తంగా ఊహించని అంచనాలు … ఇవన్నీ ‘సాహో’ టీమ్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. .యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన సాహో సినిమా ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతోంది.
‘బాహుబలి’ తర్వాత అంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేశారు. ఎక్కడవిన్నా.. ఎ గుంపులోకి వెళ్లినా ఈ ‘సాహో’ టాకే! టాలీవుడ్ లో అయితే. ఏ షూటింగ్ స్పాట్ లోకి వెళ్లినా ఈ ‘సాహో’ సినిమా గురించే చర్చించుకుంటోంది. ఈ చిత్రం తెలుగు సినిమా స్టామినాను మరింత పెంచుతుందా? లేదా? అని టాలీవుడ్ లో అయితే చిత్ర పరిశ్రమకు చెందిన వారు బెట్టింగులు సైతం కాస్తున్నారా!? ఓ సినిమాపై టాలీవుడ్ లో బెట్టింగులు కట్టడం ఇదే తొలిసారి అంటున్నారు చిత్ర సీమకు చెందిన కొందరు ప్రముఖులు.
అయితే విడుదలకు ముందే ఈ చిత్రానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. సాహో ప్రెస్ మీట్ ను కోలీవుడ్ మీడియా బోయ్ కాట్ చేయడం తెలిసిందే. ఏమిటీ గొడవ? ఇంత ప్రతిష్ఠాత్మక చిత్రానికి? అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి ఊహించని ముప్పు ‘సాహో’ నిర్మాతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని తెలుస్తోంది. మీడియా నుంచి ఊహించని చిక్కులు వచ్చి పడటం పెద్ద దెబ్బే అని టాలీవుడ్ చిత్రపరిశ్రమ భావిస్తోంది. కారణాలు ఏమైనా ‘సాహో’కి ఊహించని చిక్కులొచ్చి పడ్డాయ్. కేవలం తమిళనాడు నుంచి దాదాపు 200 కోట్లు కొల్లగొట్టాల్సిన సినిమా మీడియా నెగెటివ్ ప్రచారంతో ఎలాంటి ముప్పును ఎదుర్కొంటుందోనన్న సందేహం నెలకొంది. అంతే కాదు.. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రపంచ ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. పారిస్‌లోని ఈ థియేటర్లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది.ఇప్పటికే సౌత్ నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా సాహోకు ఈ ఘనత దక్కింది.
ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు.. ‘బాహుబలి’ పుణ్యమా అని ఆయన నేషనల్ హీరో అయిపోయారు. దాంతో ఆయన కేవలం మన మీడియానే కాక నార్త్ ఇండియా మీడియాని సైతం ఫేస్ చేయాల్సి వస్తోంది. ఇన్నాళ్లూ మీడియాకు దూరంగా ఉంటూ.. కేవలం సోషల్ మీడియాకే పరిమితమై వచ్చిన ప్రభాస్ తన తాజా చిత్రం ‘సాహో’ కోసం మీడియా ముందుకు రాక తప్పలేదు, ఇవన్నీ బాగానే ఉన్నా, ‘బాహుబలి’ తర్వాత అంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలవుతున్న ఈ సినిమా నిర్మాతలను గట్టెక్కిస్తుందా? టాలీవుడ్ ను మరోసారి ప్రపంచ సినిమా పటంలో చూసేలా చేస్తుందా? లేదా? అని తెలుగు చిత్రసీమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది!!