మాస్ మహారాజా రవితేజ ఇటీవల కాలంలో ఆయన నటించిన చిత్రాల్లో పెద్దగా హిట్ అయిన చిత్రాలు ఏమీ లేవనే చెప్పాలి. అనిల్‌రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ చిత్రం కాస్త పర్వాలేదనిపించుకున్నా. ఆ తర్వాత వచ్చిన చిత్రాలేమీ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే ఆయన త్వరలో మెగా ఫోన్ పట్టనున్నారని సమాచారం. అయితే అందులో ఆయన నటించరట. ప్రస్తుతం ఆయనవి రెండు విభిన్న చిత్రాలు ఒకటి `డిస్కోరాజా` మరొకటి `క్రాక్`. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ రూపొందిస్తున్న `డిస్కోరాజా` ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ హీరో రవితేజతో పాటు బాబీ సింహాని ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలె ఇంటర్వ్వూ చేశారు.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిందని వాళ్ళ మైండ్ సెట్ఖి తగ్గ చిత్రాలను తీయాలని పేర్కొన్నారు. కథలో ఎంత కొత్తదనం ఉంటే జనాలు అంత ఇష్టపడుతున్నారాన్నారు. అయితే ఈ ఇంటర్వ్వూ మొత్తంలో తను కూడా త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే టాలీవుడ్‌కి వచ్చిన చాలా మంది హీరోలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని అప్పుడప్పుడు చెబుతుంటారు. అయితే డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లు కూడా ఇక్కడ చాలా మందే వున్నారు. నాని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి కాలం కలిసి రావడంతో ఇంద్రగంటి మోహనకృష్ణ `అష్టాచమ్మా` చిత్రంతో హీరో అయ్యారు. ఈ నేచురల్ స్టార్ తరహాలోనే డైరెక్టర్ కావాల్సిన మాస్ మహారాజా రవితేజ క్యారెక్టర్ అర్టిస్ట్ నుంచి `సిందూరం`తో యాక్టర్ గా పరిచయమై… మాస్ మహారాజాగా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన నటించిన డిస్కోరాజా చిత్రంలోని మూడవ పాట నిన్ననే విడుదలైంది. ఆ పాట కూడా సూపర్ వ్యూస్‌ను తెచ్చుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ పాజిటివ్ టాక్‌తో దూసుకువెళుతున్నాయి. ఇందులో బాగా హిట్ అయిన సాంగ్ ఏమో ఏమో అనే పాట సూపర్‌డూపర్ హిట్ అయింది.