షాకింగ్!! ఆ స్టార్ హీరోని చంపడానికి ప్లాన్

 

స్టార్ హీరోని చంపటానికి ప్లాన్ వేశానని స్వయంగా తెలిపాడు ఓ రౌడీ. బెంగుళూరుకు చెందిన సైకిల్ రవి అనే రౌడీ కన్నడ స్టార్ హీరో యశ్ ని చంపటానికి ప్లాన్ జరిపినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ కేసు విచారణలో భాగంగా సిబిఐ పోలీసుల్లో అతడి నుండి పూర్తి సమాచారాన్ని సేకరించారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు ఆ రౌడీ.

కన్నడ హీరో యశ్:

అతను చెప్పిన వివరాల ప్రకారం బెంగుళూరుకు దగ్గరలో జరిగిన ఓ మందు పార్టీలో హీరో యశ్ ని చంపాలి అనుకున్నారు కానీ ఆ ప్లాన్ ఇంకా అమలు చేయలేదట. నిర్మాత జయణ్ణకు, యశ్ కు వివాదం తలెత్తిందట. అప్పటి నుండి యశ్ ని చేమ్పాలని ప్రయత్నిస్తున్నానని తెలిపాడు రవి. కానీ అతను చెప్పిన విషయాలు పోలీసులు మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే అతను తరచూ ఇలానే చెబుతున్నాడట. తాగిన మత్తులో పలుసార్లు ఇలానే చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు పెద్దగా పట్టించుకోకపోయినా ఈ విషయం మాత్రం కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపింది అని తెలుస్తోంది.