శర్వానంద్ నేపాల్ వెళ్తున్నాడు..ఎందుకంటే?

హను రాఘవపూడి దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా శర్వానంద్, సాయి పల్లవి నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నిర్మాణం జరుగుతోంది . ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను 70 రోజులపాటు కోల్‌క‌త్తాలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరించారు. మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని తర్వాతి షెడ్యూల్ కోసం నేపాల్ వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నారట.

కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొడ్యూసర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రధాన తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను కోల్‌క‌త్తా షెడ్యూల్ లో చిత్రీకరించాము. సినిమా బాగా వస్తుంది. డైరెక్టర్ హను రాఘవపూడి మంచి ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శర్వానంద్, సాయి పల్లవి సినిమాలో చూడముచ్చటగా కనిపిస్తారు. మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. జయకృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు’. అని తెలిపారు.