వెబ్ ఫిలిం లో మహేష్ హీరోయిన్ కియారా అద్వానీ

కియారా అద్వానీ అంటే తెలీదేమో కానీ ‘భరత్ అనే నేను’ హీరోయిన్ అంటే అందరికీ గుర్తు వచ్చేస్తుంది. ఈ అమ్మాయికి ఆ సినిమా తరువాత తెలుగులో సరైన విజయం లేక బాలీవుడ్ వైపు అడుగులు వేయగా అక్కడ విజయాన్ని అందుకుని తీరిక లేకుండా ఉంది.

ఇంతకీ విషయం ఏంటంటే ఈ అమ్మడు అది వరకు లస్ట్ సిరీస్ అనే వెబ్ ఫిలిం చేసింది. ఇప్పుడు మళ్ళీ కరణ్ జోహార్ సంస్థలో మరో వెబ్ ఫిలిం చేయనుంది. ‘గిల్టీ’ గా ఈ వెబ్ ఫిలిం టైటిల్ ఖరారు చేశారు.