Home Tollywood వినయ విధేయ రామ ఎవరో చిరంజీవి చెప్పేశాడు

వినయ విధేయ రామ ఎవరో చిరంజీవి చెప్పేశాడు

గురువారం నాడు హైద్రాబాద్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ చరణ్ నటించిన “వినయ విధేయ రామ ” సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది .

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ , చిరంజీవి ముఖ్య అతిధులుగా వచ్చారు .  కేటీఆర్ చిరంజీవిని , పవన్  కళ్యాణ్ , రామ చరణ్ ను పొగాధలతో ముంచేశాడు . నేను మాత్రం తక్కువ తిన్నానా అంటూ చిరంజీవి కేటీఆర్ ను అతిశయోక్తులతో ఆకాశానికి లేపాడు .

అది ఎంతగా అంటే వేదిక మీద రామ చరణ్ ఉన్నాడనే మాట కూడా మర్చిపోయాడు . “ఈ సినిమాకు వినయ విధేయ రామ అని పెట్టారు . ఈ టైటిలుకు కల్వకుంట్ల తారక రామారావు కరెక్ట్ గా సరిపోతాడు . ఆ వినయ, ఆ విధేయత కలిగిన తారక రాముడు ” అని ఒకటే  పొగడ్తలు .

ఆ మాటలు చెబుతున్నప్పుడు కేటీఆర్  చాలా ఇబ్బంది పడిపోయాడు. కేసీఆర్  కుటుంబంతో మెగా కుటుంబం అన్ని విధాలా కలసిపోయిందనటానికి ఇంతకంటే ఉదాహరణ అక్కరలేదేమో .  ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ అన్న విధంగా సాగింది

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీఆరెస్ కు సహకరించాడనే వార్తలు కూడా నిజమేనేమో అనిపించింది . రాజకీయంగా పవన్ కు  కేసీఆర్ కుటుంబం దగ్గరైంది . ఇది నిజం .

- Advertisement -

Related Posts

పైన ప‌టారం లోన లొటారం .. అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్ !

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్‌కు మారు పేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు...

బిగ్ బాస్ బ్యూటీ హిమ‌జ‌కు ప‌వ‌న్ కళ్యాణ్ లేఖ‌ !

గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ సినిమాల‌కు దూరంగా ఉన్న అయన క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అభిమానుల సంగ‌తి అటుంచితే సెల‌బ్రిటీలు సైతం ప‌వ‌న్ అంటే ప‌డిచ‌చ్చిపోతున్నారు. ఆయ‌న నుండి ఏదైన...

రేయ్ ఇక ‘అల్లరి’ పేరు మార్చేయ్ .. నాని సలహా !

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ మూవీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అల్లరి నరేష్ గత 8 ఏళ్ళలో విజయం లేకుండా ఎంతగా కష్టపడ్డాడో అందరికి తెలిసిందే. సుడిగాడుతో వచ్చిన...

Latest News