గురువారం నాడు హైద్రాబాద్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ చరణ్ నటించిన “వినయ విధేయ రామ ” సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది .
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ , చిరంజీవి ముఖ్య అతిధులుగా వచ్చారు . కేటీఆర్ చిరంజీవిని , పవన్ కళ్యాణ్ , రామ చరణ్ ను పొగాధలతో ముంచేశాడు . నేను మాత్రం తక్కువ తిన్నానా అంటూ చిరంజీవి కేటీఆర్ ను అతిశయోక్తులతో ఆకాశానికి లేపాడు .
అది ఎంతగా అంటే వేదిక మీద రామ చరణ్ ఉన్నాడనే మాట కూడా మర్చిపోయాడు . “ఈ సినిమాకు వినయ విధేయ రామ అని పెట్టారు . ఈ టైటిలుకు కల్వకుంట్ల తారక రామారావు కరెక్ట్ గా సరిపోతాడు . ఆ వినయ, ఆ విధేయత కలిగిన తారక రాముడు ” అని ఒకటే పొగడ్తలు .
ఆ మాటలు చెబుతున్నప్పుడు కేటీఆర్ చాలా ఇబ్బంది పడిపోయాడు. కేసీఆర్ కుటుంబంతో మెగా కుటుంబం అన్ని విధాలా కలసిపోయిందనటానికి ఇంతకంటే ఉదాహరణ అక్కరలేదేమో . ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ అన్న విధంగా సాగింది
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీఆరెస్ కు సహకరించాడనే వార్తలు కూడా నిజమేనేమో అనిపించింది . రాజకీయంగా పవన్ కు కేసీఆర్ కుటుంబం దగ్గరైంది . ఇది నిజం .