విజయ్ దేవరకొండ హుషారుకు కారణం ఇదీ..

రౌడీ స్టార్ కి చీవాట్లు.. అంత త‌ప్పేం చేశాడ‌ని?

విజయ్ దేవరకొండ మరో యంగ్ టాలెంట్ కు ఛాన్స్

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో సౌత్ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మాత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ ఊపులో మరో యూత్ ఫుల్ చిత్రానికి అంకురార్పణ చేస్తున్నాడు విజయ్. తన తదుపరి చిత్రానికి డైరక్ట్ చేసే ఛాన్స్ ను హుషారు డైరెక్టర్ కు ఇస్తున్నాడట .

హుషారు చిత్రంతో తన ప్రతిభని నిరూపించుకున్న శ్రీ హర్ష కొనుగంటి కి విజయ్ దేవరకొండ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ లభించింది . గత ఏడాది విడుదలైన హుషారు మంచి హిట్టైంది . యువతకు నచ్చే అంశాలతో తెరకెక్కిన హుషారు మంచి హిట్ అయ్యింది దాంతో ఆ సినిమాని ఇతర బాషలలో కూడా రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యే అవకాసం ఉంది.

ఇదిలా ఉంటే..విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఒక‌టి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు క‌ర‌ణ్ జోహార్, సిద్ధార్ధ్ రాయ్ క‌పూర్, సాజిద్ న‌డియావాలా ఈ ముగ్గురు క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్ర‌లో ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేశార‌ట‌. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 6న లాంచ్ కానుందని బాలీవుడ్ టాక్.