స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అలా కోలీవుడ్, ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాతో వస్తే మన స్టార్ హీరోల సినిమాలు ఓ రేంజ్ లో విజయాన్ని అందుకుంటాయి.
కానీ ఈ మధ్య మాత్రం సూర్య సినిమాలకు తెలుగులో బాగా క్రేజ్ తగ్గిపోతుంది. దీనితో సరైన హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది. అదే సమయంలో అక్కడ విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తో తీసిన చిత్రం “ఎన్ జి కె”. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ లు నటించిన ఈ పొలిటికల్ డ్రామా అనుకున్న స్థాయి విజయం అందుకోలేదు.
అయితే ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్లో అతి త్వరలో టెలికాస్ట్ చేయనున్నారని తెలుస్తుంది. అందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయట కూడా! చూడాలి మరి తెలుగునాట స్టార్ హీరో సూర్యకు మళ్లీ మంచి వస్తాయో.. లేదో!?
