లుంగీ, త‌ల‌పాగాతో రౌడీ మ‌ళ్లీ ఫిదా చేశాడు!

టాలీవుడ్‌లో వున్న యువ హీరోల్లో అత్యంత క్రేజీయెస్ట్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌న సినిమాల‌కి యూత్‌లో క్రేజ్‌ని తీసుకురావ‌డంలో, సినిమాని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డంలో విజ‌య్ శైలి ప్ర‌త్యేకం. బాలీవుడ్‌లో ర‌ణ్‌వీణ్‌సింగ్‌లా యునిక్ స్టైల్‌ని మెయింటైన్ చేస్తూ యూత్‌ని పిచ్చెక్కిస్తున్న ఈ రౌడీ హీరో మ‌ళ్లీ మ‌రోసారి త‌న‌దైన స్టైల్లో యూత్‌ని, ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. ఈ సినిమా ఈ నెల 14న వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ కాబోతోంది.

ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర బృందం వైజాగ్‌లో బుధ‌వారం ప్రీరిలీజ్ వేడుక‌ని నిర్వ‌హించింది. సినిమాపై బ‌జ్ త‌క్కువ‌గా వుండ‌టంతో రంగంలోకి దిగిన రౌడీ జోష్ పెంచేశాడు. ఈ కార్య‌క్ర‌మానికి వినూత్నంగా డ్రెస్ చేసుకుని రావ‌డం అక్క‌డున్న వారిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. బాంబే డ‌యింగ్ లుంగీ, త‌ల‌పై రుమాల్ క‌ట్టుకుని ప‌క్కా మాస్ అవ‌తార్‌లో ఏ ఆడియో ఫంక్ష‌న్‌కి హీరో రాని వేష‌ధార‌ణ‌లో వ‌చ్చి విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి ఆడియ‌న్స్‌ని, అభిమానుల్ని ఫిదా చేశాడు. `ఫైట‌ర్` సినిమా షూటింగ్ కారణంగా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ని ప‌ట్టించుకోలేద‌ని, దాంతో రోజు హీరోయిన్స్ ఫోన్‌లు చేస్తూ బ‌జ్ క్రియేట్ చేద్దామ‌ని బెదిరించార‌ని, రాశిఖన్నా మాత్రం త‌న‌ని బాగా భ‌య‌పెట్టింద‌ని రౌడీ హీరో స్ప‌ష్టం చేశాడు.

త‌న సినిమాల‌కు బ‌జ్ వుండ‌టానికి కార‌ణం త‌న రౌడీ ఫ్యాన్సే నని, తాను ఫ్యాన్స్‌కి ఇచ్చే గ్యారంటీ ఒకేఒక్క‌ట‌ని. త‌న సినిమాకు వెళితే ఏదో ఒక కొత్త అనుభ‌వం క‌ల‌గ‌డం గ్యారెంటీ అని మాటిచ్చాడు. హీరోయిన్స్ చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశార‌ని, వాలెంటైన్స్ డే రోజున అంతా థియేట‌ర్‌కు వ‌చ్చి సినిమాని చూడాల‌ని కోరుకుంటున్నాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేక్ష‌కుల్ని కోర‌డం ఆక‌ట్టుకుంది.