రెండేళ్ల తరువాత సినిమాలోకి శ్రీముఖి

వ్యాఖ్యాత శ్రీముఖి బుల్లి తెర అభిమానులకు సుపరిచుతురాలే. ఆమె కూడా సినిమాల వైపు తొంగి చూస్తోంది. అది వరకు చేసిన ఒకట్రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అందువల్ల కొద్దిగా విరామం తీసుకుని ఇప్పుడు కొత్త సినిమా సంతకం చేసింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు గౌతమ్ ఈవీఎస్ దర్శకత్వం చేయనున్నారు. అంతకు ముందెన్నడూ చూడని కొత్త శ్రీముఖిని ఇందులో చూస్తారని చిత్ర బృందం తెలిపింది.