యుఏ సర్టిఫికెట్, అధిక రన్ టైం తో ‘డియర్ కామ్రేడ్’

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యి సంచలనం అయింది. మరో అర్జున్ రెడ్డి 2 అవుతుంది అంటున్న ప్రేక్షకులు. ఆ పైన హిట్ పెయిర్ రష్మిక-విజయ్ ల రెండో సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమా దక్షిణాది నాలుగు భాషల్లో విడుదల అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యుఎ సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా పూర్తి రన్ టైం 2 గంటల 49 నిముషాలు. అంటే అర్జున్ రెడ్డి కంటే కాస్త తక్కువ (3 గంటలు) అన్నమాట. ఏదేమైనతేనే ఈసారి విజయ్ తనలో ఎలాంటి కోణాన్ని తెర పై చూపిస్తాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

కొత్త దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఈ నెల 26 న విడుదల అవుతుంది.