హాట్ యాంకర్ శ్రీముఖి.. ట్యాలెంటెడ్ యాంకర్ రవి మధ్య ఎఫైర్ కహానీ తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసి సుదీర్ఘ కాలం బుల్లితెర షోలు చేస్తున్న సంగతి తెలిసిందే. యాంకర్ లాస్య రవికి దూరమైనప్పటి నుంచి ఈ కొత్త జంట బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎఫర్ నడుస్తోందన్న పుకార్ ఉంది. రవి-లాస్య మధ్య చిచ్చు రేగడానికి అసలు కారణం శ్రీముఖి అని కూడా అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే తర్వాత దీనిపై రవి-లాస్య అలాంటిదేమి లేదని ఖండించారు. ఆ షోలకు సంబంధించి క్రియేటివ్ మ్యాటర్స్ లో విభేధాలు తలెత్తడంతో కలిసి పనిచేయలేదని వివరించారు. అయితే ఇది గతం గతః! ప్రస్తుతం రవి-లాస్య మధ్య ఏం జరుగుతుందన్నది పరిశ్రమలో సహా ప్రేక్షకుల్లోనూ ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఓ ఇంటర్వూలో ఈ జోడీ కలిసి క్లారిటీ ఇచ్చేశారు. అసలు విషయం చెప్పేసారు. సూటిగా ఇంటర్వ్యూ చేసే పర్సన్ అడిగిన ప్రశ్శకు సమాధానమిచ్చారు. “ఇద్దరూ లవ్ లో ఉన్నారు? సహజీవనం చేస్తున్నారని విన్నాం. ఇందులో ఎంత నిజం ఉంది?“ అన్నది ప్రశ్న. దానికి రవి అలాంటిదేమి లేదని తెలిపాడు. ఇద్దరు కలిసి ఓ ప్రొగ్రాం చేస్తున్నప్పుడు..అది కూడా సంవత్సారల పొడవునా కలసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి రూమర్లు సహజంగా వస్తుంటాయి. మా ఇద్దరి మధ్య కూడా అలాంటిదే జరిగింది. మీడియాలో వచ్చే కథనాల్లో ఎలాంటి నిజం లేదు. ఒక షో చేస్తున్నప్పుడు భుజాలపై చేతులేయడం…కాళ్లు పట్టుకోవడం.. హగ్గు చేసుకోవడం వంటివి సహజంగా జరుగుతుంటాయి… అంత మాత్రానా కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు రాసేస్తా! ఎలా..వాస్తవాలు గ్రహించాలి కదా? అని రవి సీరియస్ అవ్వడం చర్చకొచ్చింది.
అంతేకాదు.. ఇలా చూడడంపై ప్రేక్షకుల్ని బ్లేమ్ చేశాడు మరి. జనం సినిమా కల్చర్ కి అలవాటు పడి.. బుల్లి తెర వాళ్లని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని వాళ్లపైనా సెటైర్ వేసాడు. అయినా ఇలాంటి వాటిని నేను-శ్రీముఖి పెద్దగా పట్టించుకోవాలనుకోవడం లేదు. అలాగైతా లాస్యతో నాకెన్ని లింకప్ వార్తలు రాసారో తెలుసు కదా? సీరియస్ గా తీసుకునేవాడినైతే ఎప్పుడో పంచాయతీ పెట్టేవాడినని అన్నాడు. రవిలో ఈ యాంగిల్ చూశాక ఇంకెవరు అంటారులే!