మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాణా ‘విరాట పర్వం’

రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా వేణు అడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విరాట పర్వం’. 90 ల నాటి కాల పరిస్థితులతో కూడిన పీరియడ్ సినిమా ఇది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. తెలంగాణలోని దారిపల్లి అనే గ్రామంలో చిత్రీకరణ జరుపుకుంది. రెండవ షెడ్యూల్ ఎక్కడ జరిగేదీ ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇందులో సాయి పల్లవి కీలక పాత్ర పోషించనుంది.