మహర్షిని మెచ్చుకున్న మాజీ క్రికెటర్

మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించింది అందరికీ తెలుసు. ఈ సినిమాని పరిశ్రమ పెద్దలూ, ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు మరో తెలుగు తేజం, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వంతు వచ్చింది.

ఆయన తన సోషల్ మీడియా హేండిల్లో ‘మహర్షి’ సినిమా చూశానని చాలా నచ్చిందని, ప్రజలకు మంచి సందేశాన్నిచ్చే సినిమా చేసారని ట్వీట్ చేయగా దానికి ప్రతిగా మహేష్ ‘థాంక్ యు సర్’ అని జవాబిచ్చారు