మరోసారి వెబ్సెరీస్ లో మెగా తనయ నిహారిక

మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా అడుగు పెట్టింది కొణిదెల నిహారిక. హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసినా అవేమీ విజయవంతం కాలేదు సరి కదా వాటి పేర్లు కూడా ఎవరికీ తెలియదు. దాంతో ఇక సినిమాలకు దూరంగా ఉండాలనుకుంది. అలాగని నటన మానేస్తుందని కాదు.

ఆమె గతంలో ‘ముద్ద పప్పు ఆవకాయ’ అనే వెబ్ సిరీస్లో నటించింది. అలాగే ఇప్పుడు ‘మాడ్ హౌస్’ అనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం ‘సై రా’ సినిమాలో ఇక చిన్న పాత్రలో కనిపించనుంది. ఇలా తమ సొంత బ్యానర్లో కనిపిస్తాను తప్ప హీరోయిన్ గా నటించానని నిర్ణయం తీసుకుందట.