Home Tollywood బెల్లంకొండ‌తో ఇస్మార్ట్ భామ దుమ్మురేప‌నుందా...?

బెల్లంకొండ‌తో ఇస్మార్ట్ భామ దుమ్మురేప‌నుందా…?

112 6682 | Telugu Rajyam

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటుచేసిన విలేఖ‌రుల సమావేశంలో…

ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ `ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొంద‌బోతోంది. డిసెంబ‌ర్ 6 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, దుబాయ్, అబ్రాడ్ లో చిత్రీక‌రణ జ‌ర‌ప‌బోతున్నాం. వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో సాయిశ్రీనివాస్ క‌నిపిస్తాడు. త‌న కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత బెల్లంకొండ సురేష్ గారికి, చిత్ర నిర్మాత సుబ్ర‌హ్మ‌ణ్యం గారికి ధ‌న్య‌వాదాలు. బిజీ షెడ్యూల్ లో కూడా మా సినిమాకు అంగీక‌రించిన దేవిశ్రీ ప్ర‌సాద్ గారికి కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు.

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ `ద‌ర్శ‌కుడు సంతోష్ తో వ‌ర్క్ చేయ‌డం నా కుటుంబ స‌భ్యుల‌తో చేసిన‌ట్టుగా ఉంది. మంచి పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్ట‌ర్. అల్లుడు శీను, జ‌య‌జాన‌కి నాయ‌క త‌ర్వాత దేవిశ్రీ ప్ర‌సాద్ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన వి.వి.వినాయ‌క్, దిల్ రాజు, జెమినీ కిర‌ణ్ గార్ల‌కి థ్యాంక్స్` అని అన్నారు.

`ఇస్మార్ట్ బ్యూటీ` న‌భా న‌టేష్ మాట్లాడుతూ `సాయిశ్రీనివాస్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. న‌ట‌న‌కి ఆస్కార‌మున్న పాత్ర పోషించ‌నుండ‌టం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన‌ సురేష్ గారికి కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు.

 

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

క్రాక్ హిందీ రీమేక్ రైట్స్.. డిమాండ్ మామూలుగా లేదు

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ డైలీ కోటికి తక్కువ రావడం లేదు. ఇక రానున్న రోజుల్లో థియేటర్స్...

మరో సినిమాతో బిజీగా మారనున్న మెగాస్టార్.. డేట్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అపజయం లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

Latest News