బెల్లంకొండ హిందీ సినిమా పైన క్లారిటీ వచ్చింది

బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. అయితే మొదట్లో దూకుడు మీద సినిమాలు చేసేసాడు. ‘రాక్షసుడు’ సినిమా తప్ప మిగతావి అంతగా ఆడలేదు. ‘అల్లుడు అదుర్స్’ సినిమా ప్లాప్ తర్వాత బెల్లంకొండ నుండి ఏ సినిమా రాలేదు.

ఆ మధ్య హిందీ లో ప్రభాస్ ‘ఛత్రపతి’ సినిమాని ప్రారంభించారు. వి వి వినాయక్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా పైన ఎలాంటి అప్డేట్ రాలేదు. చాలా మంది ఈ సినిమా ఇప్పటికే చాలా రీషూట్స్ అయ్యిందని అందుకే ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని అనుకున్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆగిపోలేదు, షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఫస్ట్ లుక్ కోసం రెడీ గా ఉంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు టైటిల్ పెట్టలేదు. ‘ఛత్రపతి’ అని టైటిల్ పెడదామంటే ఇప్పటికే ఈ టైటిల్ ని వేర్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. అందుకే కొత్త టైటిల్ కోసం మూవీ టీం చూస్తుంది. కొత్త టైటిల్ ఫిక్స్ అవ్వగానే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.