Bellamkonda: మరో వివాదంలో భైరవం మూవీ… బెల్లంకొండ శ్రీనివాస్ వ్యాఖ్యలు పవన్ గురించేనా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భైరవం. ఈ సినిమా మే 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలను నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఇప్పటికే ఈ సినిమా పూర్తిస్థాయిలో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

ఒకవైపు జగన్ అభిమానుల నుంచి మరోవైపు చిరు అభిమానుల నుంచి ఈ సినిమాకు పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా వివాదంలో నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు ఒకరే అంటే ఎలా తాను కూడా పలువురు హీరోల మాదిరి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటున్నాను అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడారు.

ఇలా ఈయన మాట్లాడిన మాటలు సరదాగే మాట్లాడిన కొంతమంది మాత్రం ఈ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 3 పెళ్లిళ్లు చేసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారనీ పవన్ అభిమానులు భైరవం టీం పై విమర్శలు కురిపిస్తున్నారు.

ఇప్పటికే వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానుల నుంచి ఈ సినిమాకు పూర్తిస్థాయిలో వ్యతిరేకత రావటమే కాకుండా సోషల్ మీడియాలో బాయ్ కాట్ భైరవం హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి నెగిటివీటి రావడంతో ఈ సినిమా వివాదంలో చిక్కుకుందనే చెప్పాలి.