Home Tollywood ప్చ్.. ‘సైరా’యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ తక్కువే

ప్చ్.. ‘సైరా’యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ తక్కువే

ప్రీమియర్స్ లో సత్తా చాటలేకపోయిన సైరా

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదలైంది. ఐదు భాషలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా చిత్రంపై హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా పై ఉన్న హైప్ దృష్ట్యా యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ కూడా సైరా సత్తా చాటుతుందని, మినిమం వన్ మిలియన్ కు పైగా వస్తుందని అంచనా వేసారు. అయితే అనుకున్నట్లు జరగలేదు. ట్రేడ్ పండిట్స్ అంచనాలు తప్పాయి. నార్త్ అమెరికా నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ కు $857K వసూలు చేసింది. ఖైధీ నెంబర్ 150 సినిమా కలెక్ట్ చేసినంత కూడా చేయలేకపోయింది.

ఇది ప్రక్కన పెడితే ఈ సినిమాకు బాగా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి..స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు మెగాస్టార్ చిరంజీవి ప్రాణం పోశారని రాజమౌళి ప్రసంశించారు. నెటిజన్లతోపాటు విమర్శకులు సైతం సోషల్‌మీడియాలో ‘సైరా’ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు ట్విటర్‌ ఇండియాలో ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ నం.1లో ఉండటం విశేషం. ఈ సినిమాను చూసిన జక్కన్న, హరీష్‌ శంకర్‌, శోభూ యార్లగడ్డ తదితరులు సోషల్‌మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

చిరంజీవి మొదటిసారి ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించిన సైరా చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా హీరో రామ్ చరణ్ నిర్మించారు. నయనతార, తమన్నా, అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేయడం జరిగింది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్మించారు.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News