పవన్ కోసం క్రిష్ కథ సిద్ధం చేస్తున్నాడా?

పవన్ కళ్యాణ్ పునః సినీ రంగ ప్రవేశం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ‘సై రా’ సినిమాలో వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా సినిమాలకి సిద్ధం అనే సంకేతం అనే అర్ధం చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఆ పైన పవన్ సినీ దర్శకులను కలవడంతో ఈ వాదనకు మరింత బలం చేకూర్చినట్టు అయింది.

ఓ పక్కన ఎన్ఠీఆర్ బయోపిక్ పరాజయం పాలవడంతో దర్శకుడు క్రిష్ సినిమా అంటే నిర్మాతలు ఇష్ట పడడం లేదు. అందుకోసం పవన్ కి కథ రాసి అయన చేత సరే అనిపించుకుంటే నిర్మాతలకు కొదవ ఉండదు అని అనుకున్నాడో ఏమో ఇప్పుడు పవన్ కోసం కథ రాస్తున్నాడట. మరి ఇది పవన్ ఒకే చేస్తే మళ్ళీ 2017 తరువాత సినిమా చేసినట్టు అవుతుంది పవన్. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.